- ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో కలిసి పనిచేద్దాం
- జర్మనీ పార్లమెంటు బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
- 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతం, మీ లక్ష్యాలపై స్పష్టంగా ఉన్నారు: జర్మనీ పార్లమెంట్ బృందం
జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రజాభవన్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జర్మనీ పార్లమెంటు బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు బృందాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, కలిసి పని చేద్దామని డిప్యూటీ సీఎం తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, జర్మనీ ప్రసిద్ధి చెందిన మెటలర్జీ, కార్ల తయారీ రంగంలో జర్మనీతో కలిసి పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం జర్మనీ పార్లమెంట్ బృందానికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫీచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది దీంతోపాటు మూసి పునర్జీవనం, వ్యవసాయ ఆధారిత రంగం పైన ఆసక్తిగా ఉంది, హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్ గా వెలుగొందుతుందని ఈ రంగాల్లో జర్మనీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫీచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ లో జర్మన్ లాంగ్వేజ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తద్వారా తెలంగాణ విద్యార్థులు జర్మనీ భాష నేర్చుకొని జర్మనీ దేశంలో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయాల్లో చాలా దూర దృష్టితో సైబర్ ఆఫ్ exlence కేంద్రం ఏర్పాటు చేశామని ఈ రంగంలో లోతుగా అధ్యయనం చేస్తున్నామని జర్మనీ పార్లమెంట్ బృందానికి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. సీనియర్ పోలీసు అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేశామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా రెండు ఫ్లోర్లు సైబర్ సెక్యూరిటీ కోసం కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. జిల్లాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఆర్థిక నేరాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, ఫైనాన్స్ రంగంలో సైబర్ ఫిషింగ్ ఎలా జరుగుతుంది, వాటిని అరికట్టేందుకు బెస్ట్ AI టూల్స్ వాడుతున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని జర్మనీ పార్లమెంటు బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రతి రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో స్పష్టంగా పేర్కొనడం అభినందనీయమని, రాష్ట్ర ప్రగతి పట్ల మీ నిబద్ధత ఈ డాక్యుమెంట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుందని జర్మనీ పార్లమెంట్ బృందం డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. సైబర్ సెక్యూరిటీ, స్కిల్ లేబర్ అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నామని జర్మన్ పార్లమెంట్ బృందం వివరించింది. జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు చాలామంది భారతదేశంలో పెట్టుబడులు పెట్టారని, తమ దేశానికి చెందిన BOSH వంటి ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడ పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నాయి, తమ దేశానికి చెందిన ఇంజనీర్లు భారత దేశంలో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నారని జర్మనీ పార్లమెంటు బృందం వివరించింది. భారతదేశానికి చెందిన 60 వేల మంది విద్యార్థులు జర్మనీలో వివిధ రకాల కోర్సులను అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు, స్కిల్డ్ లేబర్ కు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో కొదవలేదని అన్నారు.
జర్మనీ బృందంలో The delegation will be headed by Honourable Mr. Josef Oster, Member of German Parliament, Representative from the Christian Democratic Union / Christian Social
Union
- Mr. Daniel Kölbl, Member of German Parliament, Representative from the Christian Democratic Union / Christian Social Union
- Ms. Tijen Ataoğlu, Member of German Parliament, Representative from the Christian Democratic Union / Christian Social Union
- Dr. Bernd Baumann, Member of German Parliament, Representative from the Alternative for Germany
- Prof. Dr. Lars Castellucci, Member of German Parliament, Representative from the Social Democratic Party
- Ms. Lamya Kaddor, Member of German Parliament, Representative from the Alliance 90 / The Greens
- Ms. Clara Bünger, Member of German Parliament, Representative from The Left
- Dr. Christina Ziegenhorn, Secretariat of the Parliamentary Committee on the Internal Affairs of the German Bundestag,
ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇందన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సిఎండి హరీష్, ప్రణాళిక శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.