రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన భారతదేశ ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా (World Meditation Day) చేగురులోని కన్హ శాంతి వనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు . అనంతరం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఉప రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఇతర అధికారులు, పోలీస్ అధికారులు, ఘనంగా వీడ్కోలు పలికారు.