తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి. శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు నుండి బాధ్యతలను స్వీకరించిన తిరుపతి. అనంతరం అధికార నివాసంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కార్యదర్శి తిరుపతి, మండలి కార్యదర్శి నరసింహా చార్యులు. ఈసందర్భంగా శాసనసభ నూతన కార్యదర్శి తిరుపతికి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్. మండలి కార్యదర్శిగా వి. నరసింహా చార్యులు కొనసాగుతారు.