“బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్”యువత మేధస్సుకు, సృజనాత్మకతకు గొప్ప వేదిక: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాం
  • తెలంగాణ మారుమూల గ్రామాల నుండి వచ్చిన ఎంట్రీలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది
  • మీరంతా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక చైతన్యవంతమైన వారధిలా నిలిచారు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సినీ పరిశ్రమను,చిన్న సినిమాలు, నటులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం
  • తెలంగాణ పల్లెల్లోనీ యువతలో ఉన్న అపారమైన ప్రతిభను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం
  • ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క యంగ్ ఫిల్మ్ మేకర్ కు నా అభినందనలు
  • విజేతలుగా నిలిచిన వారికి శుభాకాంక్షలు
  • సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మీ అందరికీ నా పూర్తి మద్దతు ఉంటుంది
  • అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్” అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి… రాష్ట్ర టూరిజం, కల్చరర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ప్రకటించి,అవార్డులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి 3లక్షలు,రెండో బహుమతి 2లక్షలు,మూడో బహుమతి 1లక్ష.. షార్ట్ ఫిల్మ్,బతుకమ్మ వీడియో విభాగాలకు వేరు వేరుగా నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… “ఇవాళ తెలంగాణ గర్వించదగ్గ రోజు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “ప్రజా ప్రభుత్వం” దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ ఎలా చేరుతున్నాయో ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను మన యువ ఫిల్మ్ మేకర్ల చేతుల్లో పెట్టాం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్” కేవలం ఒక పోటీ మాత్రమే కాదు.. ఇది మన యువత మేధస్సుకు, సృజనాత్మకతకు ఒక గొప్ప వేదికన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి, ముఖ్యంగా మారుమూల గ్రామాల నుండి వచ్చిన ఎంట్రీలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక చైతన్యవంతమైన వారధిలా నిలిచారు. పల్లెల్లో ఉన్న అపారమైన ప్రతిభను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు ఎంతో గర్వకారణం. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క యంగ్ ఫిల్మ్ మేకర్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. గెలుపొందిన విజేతలకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. మీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు.. తెలంగాణ భవిష్యత్తును మీ కళాత్మక దృష్టితో మరింత గొప్పగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.” అని మంత్రి పేర్కొన్నారు.

తాను గతంలో దిల్ రాజు నిర్మించిన బలగం సినిమా చూసాను..ఇటీవల వచ్చిన “దండోరా” సినిమా చూసాను..సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలా,హృదయానికి దగ్గరయ్యే విధంగా ఉన్నాయి అని అన్నారు. అదేవిధంగా తెలంగాణలో సినిమాలు తీసుకోవడానికి లోకేషన్స్ పరంగా కూడా టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నామని, దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఘాట్ రోడ్డు,అటవీ మార్గాన వెళ్లే బాధలు తప్పించేందుకు 8వేల కోట్లతో మన్ననూర్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నాం. ఇది సినిమా, షార్ట్ ఫిలిమ్స్ కు మంచి లొకేషన్ అవుతుంది” అని అన్నారు.

షార్ట్ ఫిల్మ్ విభాగం – విజేతలు
ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ : సరస్సు ఙ్ఞాపకాలు(3లక్షలు)
సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ : సొంత ఇల్లు(2లక్షలు)
థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ : ఆత్మ గౌరవం(1లక్ష)
కాన్సోలేషన్ ప్రైజ్‌లు(ఒక్కో దానికి 20వేలు)..

  • కళాకారుడు
  • Nightingale On Wheels
  • వారసుడు
  • ప్రమీల
  • లచ్చి ప్రయాణం

స్పెషల్ జ్యూరీ అవార్డులు :
ఎలా బతుకాలమ్మ – (చైల్డ్ ఆర్టిస్ట్)
S/o చుక్కా రాములు – (దర్శకుడు : సందీప్ డి. జెండా)

వీడియో సాంగ్ విభాగం – విజేతలు :
ఫస్ట్ బెస్ట్ వీడియో సాంగ్ : బతుకమ్మ(3లక్షలు)
సెకండ్ బెస్ట్ వీడియో సాంగ్ : బతుకమ్మ సంబురం(2లక్షలు)
థర్డ్ బెస్ట్ వీడియో సాంగ్: ఆకాశం అంచులు దాటి(1లక్ష)
కాన్సోలేషన్ ప్రైజ్‌లు(ఒక్కోటి 20వేలు)
రామన ఉయ్యాలో
డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ
ప్రజా పాలన
తెలంగాణ బతుకమ్మ
•కొమ్మలలో కోయిలలో ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు,FDC MD సీహెచ్.ప్రియాంక,దర్శకులు హరీష్ శంకర్,తనికెళ్ళ భరణి,దశరథ్,రాహుల్ సిప్లిగంజ్,అశోక్ కుమార్,శ్రీలక్ష్మి,పీ.జీ. విందా,మంగ్లీ,సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తోపాటు పెద్ద సంఖ్యలో యువ దర్శకులు, కళాకారులు, సినీ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.