(NAC) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు (EGMM) ఈ.జీ.ఎం.ఎం. వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన ఇవ్వబడుననీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న తెలంగాణలోని గ్రామీణ యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఇంజనీరింగ్ యువతకు ఫినిషింగ్ స్కూల్ మరియు MEP Technician కోర్సులలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన ఇవ్వబడునన్నారు.
శిక్షణ వివరములు : శిక్షణ కాలం మూడు నెలలు (03 months)
శిక్షణ సమయంలో ఉచిత భోజనం మరియు ఉచిత వసతి కల్పించబడును.
శిక్షణకు కావలసిన కోర్స్ మెటీరియల్ బుక్స్, పెన్స్, స్టేషనరీ మరియు యూనిఫామ్,షూస్, హెల్మెట్ కూడా ఉచితంగా ఇవ్వబడును.
శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి NAC సర్టిఫికెట్ మరియు ఆకర్షణీయమైన జీతంతో కన్స్ట్రక్షన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించంచబడును.
కోర్సుల వివరములు :
Course Name /కోర్సు పేరు, Duration /వ్యవధి, Qualification /అర్హత
01. Land Surveyor/ ల్యాండ్ సర్వేయర్, 03 months/ 03 నెలలు, Inter/ITI/Diploma
02. Supervisor structure / సూపర్వైజర్ స్ట్రక్చర్, 03 months/03 నెలలు, Inter/ITI/ Diploma
03. Jr Store Keeper/ జూనియర్ స్టోర్ కీపర్, 03 months/03 నెలలు, Any Degree
04. Finishing school/ఫినిషింగ్ స్కూల్, (Only Free Training), 03 months/03 నెలలు, B.Tech/B.E Civil
05. MEP Technician (Only Free Training), 45 days,డిప్లొమా/ B.Tech / B.E. (EEE /Mech /Civil)
కావున ఆసక్తిగల తెలంగాణ నిరుద్యోగ యువత , NAC-Hyderabad క్యాంపస్ యందు నిర్వహించు శిక్షణ కార్యక్రమములకు హాజరవుటకు తమ యొక్క ఈ క్రింది తెలుపబడిన వివరములతో సంప్రదించగలరు.
కావాల్సిన పత్రములు: 1. ఆధార కార్డ్, 2. రేషన్ కార్డ్, 3. అర్హత పత్రాలు (Qualification certificates), 4. కులము సర్టిఫికెట్, 5. ఆదాయం సర్టిఫికెట్, 6. పాస్ ఫోటోస్-05.
పైన తెలిపిన కోర్సులకు అడ్మిషన్లు జరుగుచ్చిన్నవి. అడ్మిషన్ చివరి తేదీ జనవరి 15, 2026. కావున ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు లేదా www.nac.edu.in వెబ్ సైటు నందు రిజిస్టర్ చేసుకోగలరని న్యాక్ వైస్ చైర్మన్,రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు.
Address: National Academy of Construction, Izzat Nagar, Kothaguda post Hyderabad-500084 Cell No: 8008937800, 8328622455, 7097114947