పట్టణ ప్రగతితో ప్రతి డివిజన్ ని అద్దంలా తయారు చేయొచ్చు..
ప్రతి కార్పొరేటర్ కి పట్టణ ప్రగతి అగ్ని పరిక్ష..
ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందే..
గడినాచిన నాలుగేళ్ళ పని ఒక ఎత్తు…ఈ ఏడాది పని ఒక ఎత్తు..
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి
విజయవంతంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పట్టణ ప్రగతి విస్తృత స్థాయి కార్యక్రమం..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తల పెట్టిన అనేక కార్యక్రమాల్లో గొప్ప కార్యక్రమం “పట్టణ ప్రగతి కార్యక్రమం” అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పట్టణ ప్రగతి విస్తృత స్థాయి కార్యక్రమం ఆదివారం స్థానిక హన్మకొండ మయూరి గార్డెన్ లో జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లు మాట్లాడుతూ ఇప్పటి వరకు సిఎం కెసిఆర్ చేపట్టిన అనేక పథకాలు ఆయన అనుభవం, అద్భుత పరిజ్ఞానం ఆలోచనా ధారల నుంచి వెలువడ్డవేనన్నారు. సుదీర్ఘ రాజకీయ, ప్రజా జీవితాన్ని రంగరించి, ప్రజాభ్యుదయం, తెలంగాణ ప్రాంత పురోగతికి కావాల్సిన అద్భుత పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వాలు పల్లెలు, పట్టణాల అభివృద్ది మీద దృష్టి సారించి ఉంటే, తాజాగా ఇలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పట్టణ సంస్థల సిబ్బంది కలిసికట్టుగా పని చేస్తే పట్టణ ప్రగతితో పట్టణాలు, నగరాల్లోని ప్రతి డివిజన్ ని అద్దంలా తయారు చేయొచ్చు అన్నారు. ప్రతి కార్పొరేటర్ కి పట్టణ ప్రగతి అగ్ని పరిక్ష అని, ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందేనని సూచించారు. అభివృద్ధి లో గడిచిన నాలుగేళ్ళ పని ఒక ఎత్తు… కాగా, ఈ ఏడాది పని ఒక ఎత్తు అని అన్నారు.
నిధులు ఎన్ని ఖర్చు చేశామన్నది ముఖ్యం కాదని, ఆ నిధులను ఎలా ఉపయోగించామన్నదే ముఖ్యమన్నారు. ప్రణాళికాబద్ధంగా, ప్రజోపయోగ కార్యక్రమాలు రూపొందించాలన్నారు. వరంగల్ మహానగరం తెలంగాణకు గుండెకాయ వంటి దని, అలాగే, వరంగల్ నగరానికి హన్మకొండ కూడా గుండె కాయలాంటిదన్నారు. అందుకే ప్రత్యేక శ్రద్ధతో వరంగల్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే అవకాశం పట్టణ ప్రగతి కార్యక్రమంతో వచ్చిందన్నారు. మురుగునీటి కాలువల మరమ్మత్తులు, ఆధునీకరణ, కొత్త కాలువల నిర్మాణం, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి వసతి, ప్రణాళికాబద్ధమైన నిర్మాణాలు వంటి కార్యక్రమాలతోపాటు, ప్రజలకు అవసరమైన మంచిని చేసే సదవకాశం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందికి వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎంతో ప్రాశస్త్యం, వైభవం ఉన్న ఓరుగల్లు నగరాన్ని అత్యంత ఆకర్షణీయంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు, రైతు రుణవిముక్తి సంస్థ ర్మన్ నాగుర్ల వెంకన్న గారు, వికాలంగుల సంస్థ తొలి చైర్మన్ డాః కె వాసుదేవ రెడ్డి గారు, అజీజ్ ఖాన్ గారు, వరంగల్ నగర డిప్యూటి మేయర్ సిరాజుద్దిన్ గారు, నియోజక వర్గ కార్పోరేటర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.