- 1080 మంది బాధితులకు రూ.1003.42 లక్షల ఆర్థిక భరోసా
- TRS/BRS నిర్లక్ష్యానికి ముగింపు – కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం
- SC, ST & దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్: TRS/BRS ప్రభుత్వ హయాంలో మానిటరీ రిలీఫ్‌కు సంబంధించిన కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయి, నిధుల కొరత పేరుతో బాధితులకు న్యాయం దక్కని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా SC/ST అట్రాసిటీ కేసులకు సంబంధించి పరిహారాల ఆలస్యం కారణంగా బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగడం అప్పటి పాలనలో సాధారణంగా మారింది.
ఈ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మానిటరీ రిలీఫ్ అంశాన్ని సామాజిక న్యాయానికి కేంద్రబిందువుగా మార్చింది. బాధితులకు సమయానుకూలంగా పరిహారం అందించడమే లక్ష్యంగా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేస్తోంది.
2025–26లో గణాంకాలే సాక్ష్యం
డిసెంబర్ 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా –
• మొత్తం విడుదల చేసిన నిధులు : రూ.1032.51 కోట్లు
• మొత్తం వ్యయం : రూ.1003.42 కోట్లు
• వ్యయ శాతం : 97%
• లబ్ధి పొందిన బాధితులు : 1080 మంది
ఈ గణాంకాలు, బాధితులకు నేరుగా ఆర్థిక ఉపశమనం అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతిపై చూపుతున్న చిత్తశుద్ధికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి.
TRS/BRS vs కాంగ్రెస్ – స్పష్టమైన తేడా :: TRS/BRS ప్రభుత్వ హయాంలో :
• కేసులు, ఫైళ్లు సంవత్సరాల తరబడి పెండింగ్
• జిల్లా స్థాయిలో నిర్లక్ష్యం
• నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
• బాధితుల్లో అనిశ్చితి, అసంతృప్తి
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో :
• ప్రతి కేసుకు టైమ్‌బౌండ్ క్లియరెన్స్
• జిల్లా వారీగా లక్ష్యాల నిర్దేశం
• దాదాపు 100% నిధుల వినియోగం
• బాధితులకు నేరుగా, పారదర్శకంగా న్యాయం
SC సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వ కమిట్మెంట్
SC, ST & దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి పర్యవేక్షణలో, SC సంక్షేమాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా ..నిధుల విడుదల, వ్యయం, లబ్ధిదారుల చేరిక అన్నింటినీ సమగ్రంగా ట్రాక్ చేసే వ్యవస్థను ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఆలస్యం, మధ్యవర్తిత్వం, అవకతవకలకు పూర్తిగా చెక్ పడింది.
అత్యధికంగా మానిటరీ రిలీఫ్ అందుకున్న జిల్లాలు
• జగిత్యాల – 242 బాధితులు | రూ.157.43 లక్షలు
• భద్రాద్రి కొత్తగూడెం – 124 బాధితులు | రూ.104.70 లక్షలు
• హైదరాబాద్ – 100 బాధితులు | రూ.154.71 లక్షలు
• కరీంనగర్ – 97 బాధితులు | రూ.68.68 లక్షలు
• నాగర్‌కర్నూల్ – 90 బాధితులు | రూ.65.33 లక్షలు
• రాజన్న సిరిసిల్ల – 68 బాధితులు | రూ.70.48 లక్షలు
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …“గతంలో మానిటరీ రిలీఫ్ ఆలస్యం కారణంగా బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాల మేరకు ప్రతి కేసును టైమ్బౌండ్గా పరిష్కరించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో SC సంక్షేమం మాటల్లో కాదు .. గణాంకాల్లో కనిపిస్తోంది.” అని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, బాధ్యతాయుత పాలన అనే మౌలిక సూత్రాలతో ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. ఇకపై అర్హుడైన బాధితుడు మిస్ కాకుండా, మానిటరీ రిలీఫ్ పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.