రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ కేంద్రంలో 17. 50 లక్షలతో 50 పడకల CHC ఆసుపత్రి ని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అప్గ్రేడ్ (స్థాయిగా పెంపుదల ) చేస్తూ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 95 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడి ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులను ఆప్యాయంగా పలుకరించారు. వారికి అందుతున్న చికిత్స , డాక్టర్స్ పనితీరు ను , ఆసుపత్రిలోని ఇతర సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో స్థానిక శాసన సభ్యలు కాలే యాదయ్య , ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గోన్నారు.