కైట్ ఫెస్టివల్ మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు సమీపంలోని ఐమాక్స్ సర్కిల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు వేసే ముగ్గులు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చక్కటి సందేశాన్ని ప్రజలకు అందించాయి, ముగ్గుల ద్వారా మహిళల ఆలోచనలతో పాటు విషయ పరిజ్ఞానం బయటికి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.