- దేశంలోనే రోల్ మోడల్, గేమ్ చేంజర్
- పనుల పూర్తి క్యాలెండర్ ఖరారు చేయండి
- నిధులకు ఇబ్బంది లేదు ప్రతి 15 రోజులకు ఒకసారి పిల్లులు పే చేస్తాం
- జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేపట్టిన
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం డ్రీం ప్రాజెక్టు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ ప్రగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పూర్తిచేసే బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్ల దేనిని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. టెండర్లు పూర్తి అయినచోట మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యే తో భూమి పూజ చేయించాలని, భవనాల నిర్మాణం పూర్తికి క్యాలెండర్ ఫిక్స్ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి వారం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరపాలని నెలలో ఒకసారి కలెక్టర్లు తమ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ ప్రదేశానికి తప్పకుండా వెళ్లాలని అక్కడే సమీక్ష నిర్వహించాలని తెలిపారు. స్కూల్స్ నిర్మాణంలో నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్స్ పేమెంట్ జరుగుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటివరకు విడివిడిగా ఉన్నాయి వీటన్నిటిని ఒకే చోట చేర్చి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్న అని తెలిపారు. సమాజంలో వర్గాలుగా విడగొట్టబడినట్టు ఉన్న వారందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా ఒకచోటకు తమ ప్రభుత్వం తీసుకురాబోతుందని తెలిపారు. ఈ పాఠశాలలు దేశంలోనే ఒక రోల్ మోడల్ గా, గేమ్ చేంజెర్లుగా మారలు ఉన్నాయని తెలిపారు.
అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న 15 రోజుల్లో కాంట్రాక్టర్లు పని ప్రారంభించక పోతే కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అత్యధిక శాతం స్కూల్స్ అందుబాటులోకి రావాలని ఆదేశించారు. స్థానికంగా భూమి ఇతర సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే లేదా సిసిఎల్ఏ, చీఫ్ సెక్రటరీ తో కలెక్టర్లు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. బిల్డింగ్స్ నిర్మాణంలో ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, నిర్మాణం జరిగే ప్రాంతానికే క్వాలిటీ చెక్ బృందం వెళ్లాలని ఆదేశించారు. పనుల ప్రగతిపై వారానికి ఒకసారి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ల నుంచి నివేదిక తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య, tg wdc md గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.