ఫ‌ర్నీచ‌ర్ మాల్‌లో అగ్నిప్ర‌మాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగ్బ్రాంతి

  • స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని సూచ‌న‌
  • సంఘ‌ట‌న‌పై పూర్తిస్ధాయి నివేదిక‌కు ఆదేశం

హైద‌రాబాద్ : నాంపల్లి స్టేషన్ రోడ్ ఫర్నిచర్ మాల్‌లో శ‌నివారం జ‌రిగిన భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడిఅగ్ని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయాలని ఆదేశించారు. పోలీస్, ఫైర్ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలన్న మంత్రి పొంగులేటి అదనపు ఫైర్ ఇంజిన్స్‌తో మంటలు అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. అంతేగాక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో మాట్లాడి ఘటనా స్థలానికి వెళ్లాలని ఘ‌ట‌న‌పై పూర్తి నివేదిక‌ ఇవ్వాలని ఆదేశించారు. బాధితుల‌ను వెంట‌నే ఆదుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.