రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులోభాగంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూనే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎదుర్కొనేలా 28 గురుకుల విద్యాలయాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)లను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్.. పేదరికంలో మగ్గుతున్న అన్ని వర్గాలవారు సామాజిక, ఆర్థిక ప్రగతి సాధించేందుకు నాణ్యమైన విద్య అవసరమని భావించారు. పెద్దసంఖ్యలో గురుకులాలను ఏర్పాటుచేశారు. సాధారణ గురుకులాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా.. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సీవోఈల్లో ఉన్నత విద్యాబోధన అందిస్తున్నారు. ఐఐటీ, జేఈఈ, ఎన్‌ఈఈటీ (నీట్) వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధంచేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేస్తున్నారు. సీవోఈల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించి నాణ్యమైన విద్యను బోధిస్తున్నారు. గురుకులాల విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు దక్కించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
రాష్ట్రంలోని గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాలుఉమ్మడి జిల్లా నిర్వహించే ప్రాంతం క్యాటగిరీ
ఆదిలాబాద్ బెల్లంపల్లి బాలురు
ఆదిలాబాద్ ఆదిలాబాద్ బాలికలు
కరీంనగర్ మానకోడూరు బాలురు
కరీంనగర్ కరీంనగర్ బాలికలు
ఖమ్మం పాల్వంచ బాలురు
ఖమ్మం దాన్వాయిగూడెం బాలురు
ఖమ్మం బీఆర్‌ఏసీడబ్ల్యూఆర్‌జేఈ ఖమ్మం బాలికలు
వరంగల్ వర్ధన్నపేట బాలురు
వరంగల్ మడికొండ బాలికలు
హైదరాబాద్ షేక్‌పేట బాలురు
హైదరాబాద్ మహేంద్రహిల్స్ బాలికలు
రంగారెడ్డి చిలుకూరు బాలురు
రంగారెడ్డి హయత్‌నగర్ బాలురు
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం బాలురు
రంగారెడ్డి గౌలిదొడ్డి బాలికలు
రంగారెడ్డి గౌలిదొడ్డి బాలురు
రంగారెడ్డి నార్సింగి బాలికలు
రంగారెడ్డి కమ్మదనం బాలికలు
రంగారెడ్డి నల్లకంచె బాలికలు
రంగారెడ్డి మేడ్చల్ బాలికలు
మెదక్ కొండాపూర్ బాలురు
మెదక్ చిట్కుల్ బాలికలు
మహబూబ్‌నగర్ జేపీనగర్ బాలురు
నిజామాబాద్ బిక్నూర్ బాలురు
నిజామాబాద్ ధర్మారం బాలికలు
నల్లగొండ భువనగిరి బాలురు
నల్లగొండ జీవీగూడెం బాలికలు