మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. తులాభారం కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. • సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. మేడారం మహా జాతర ప్రాధాన్యత, నూతనంగా నిర్మించిన గద్దెలు, ఆదివాసీ చరిత్ర, భక్తులకు కల్పించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ఆయనకు వివరించారు. జాతర విశేషాలను ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించారు