మేళ్లచెర్వులో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాలుగోరోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలను అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మలు జరిపారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో శ్రీ మాతా చారిటబుల్ ట్రస్టు కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేడు హుండీ లెక్కింపు..
మహాశివరాత్రి జాతరకు హాజరైన భక్తులు హుండీల్లో వేసిన కానుకల లెక్కింపు ప్రక్రియను మంగళవారం ఆలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.