సచివాలయంలో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహణ

హైదరాబాద్ : డా. బి.ఆర్. అంబెడ్కర్ తెలంగాణా సచివాలయంలో నేడు ఉదయం ఫైర్ మాక్ డ్రిల్ల్ ను నిర్వహించారు. ప్రమాద వశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే చేపట్టాల్సిన చర్యలు, అగ్ని మాపక పరికరాలను ఏవిధంగా ఉపయోగించాలి తదితర అంశాలపై నేడు ఉదయం చేసిన మోక్ డ్రిల్ లో వివరించారు. సచివాలయం సీఎస్ఓ దేవీ దాస్, అసిస్టెంట్ కమాండెంట్స్ అప్పాజీ, పవన్ కుమార్, ఏ.డి.ఎఫ్.ఓ జీ.వి. ప్రసాద్, ఎస్.ఎఫ్.ఓ జాన్యా లతోపాటు సచివాలయానికి చెందిన దాదాపు 100 టీ,జి.ఎస్.పి.ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.