- ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064
- వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు
- ఫిర్యాది పేరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయి: ఏసీబీ
అవినీతి నిరోదక శాఖ అధికారులకు( ACB ) మరో భారీ ప్రభుత్వ లంచగొండి అధికారి పట్టుబట్టాడు. హైదరాబాద్ నగరంలోని జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డి ( SE Chinnareddy ) పై బుధవారం దాడులు జరిపి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు జోనల్ కార్యాలయంలో ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు. బాధితుడు/ఫిర్యాది పేరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారు పేర్కొన్నారు.