
అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన మంగళవారం విడుదల చేశారు. సీఎం జగన్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో ఈ వీడియోలను తయారుచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోను అవినీతి ఉండకూడని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అవినీతిని ఏరివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
వారిద్దరికీ అభినందనలు: సీఎం జగన్
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకోనున్న బండి నారాయణస్వామి, పి. సత్యవతి (అనువాద విభాగం)లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురు విశేషమైన సేవలను అందించారని ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు రచయితలను ఈ అవార్డులు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.