భ్రష్టుపట్టిపోయిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి

  • కాలుష్య బాధితుల పాలిట శాపంగా మారిన పిసిబి అధికారుల తీరు..
  • ఫిర్యాదుదారులకు అందనంత దూరంలో తెలంగాణ పిసిబి ఉన్నతాధికారులు..
  • పరిశ్రమల యాజమాన్యాలకు మాత్రం రెడ్ కార్పెట్ తో స్వాగతం
  • కొందరు అవినీతి అధికారుల అడ్డగోలు చేష్టలతో విసిగిపోయిన ఫిర్యాదుదారులు..
  • పిసిబి జోనల్ ల్యాబ్ లలో పరిశ్రమల నుండి సేకరించిన శ్యాంపిల్స్ రిపోర్ట్స్ మారుస్తున్న అవినీతి అధికారులు ఎవరు..?
  • పిసిబి ప్రధాన కార్యాలయం, ఆర్.సి.పురం, వరంగల్ ల్యాబ్ లలో విచ్చలవిడి అవినీతిని ప్రోత్సహిస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగంపై పిసిబి కల్పించే అవగాహన విషయంలోనూ భారీగా అవకతవకలు..
  • ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కొందరు పిసిబి అవినీతి అధికారులు
  • తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా.. పట్టించుకోని పిసిబి అవినీతి అధికారులు
  • పరిశ్రమలకు భారీగా బ్యాంక్ గ్యారంటీలు వేస్తూ ఫోర్ ఫిట్ చేయకుండా బోర్డు ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారులు
  • పిసిబిలో అందినకాడికి దండుకుంటున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • కన్సల్టెన్సీల ద్వారా భారీగా లంచాలు తీసుకుంటున్న కొద్ది మంది పిసిబి అవినీతి అధికారులు ఎవరు..?
  • ఉన్నతాధికారులు రిటైర్డ్ అయిన వారి స్థానాలను ఎందుకు భర్తీ చేయడం లేదు..
  • పిసిబిలో ప్రమోషన్స్ దారితప్పడానికి కారకులు ఎవరు..?
  • ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టి జల్సాలు చేస్తున్న ఆ అవినీతి అధికారులు ఎవరు..?
  • పిసిబి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్న అవినీతి అధికారులు ఎవరు..?
  • తూ తూ మంత్రంగా ఏదో చేసినట్లు పెద్దఎత్తున కలరింగ్ ఇస్తున్న ఉన్నతాధికారుల నిర్వాకం ఏమిటి..?
  • పిసిబిలోని కొంత మంది అవినీతి అధికారులకు ఉన్నతాధికారులు అంటే భయం లేకుండా పోయిందా..?
  • సంబంధిత శాఖ మంత్రి అంటే కూడా భయంలేని పరిస్థితి ఎందుకు వచ్చింది..?
  • అభూత కల్పనలతో ప్రభుత్వాన్ని ఏవిధంగా మోసం చేస్తున్నారు..?
  • పిసిబిలో జరుగుతున్న వ్యవహారాలపై ఓ ఆర్.టి.ఐ. కార్యకర్త, పలువురు పర్యావరణ వేత్తలు తీసుకువచ్చిన కళ్ళు బైర్లు కమ్మే నిజాలు ఏమిటి..?
  • కొద్దిమంది అవినీతి అధికారులపై సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికాలకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఫలితం ఎదురైంది..?
  • పిసిబిని ప్రక్షాళన చేయకుంటే తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుకోలేమా..?
  • సీఎం దృష్టి పెడితేనే తప్ప.. పిసిబి అధికారులు దారిలోకి రారా…
  • నిజాయితీ అధికారులతో పరిశ్రమలలో ఇన్స్ పెక్షన్ చేపించి తరువాత చేస్తున్నది ఏంటి..?
  • ఆర్.టి.ఐ. ద్వారా సమాచారం అడిగితే అసలు సమాచారం దాచి డొంక తిరుగుడు మాటలు చెప్పడం వెనుక ఉన్న మతలబు ఏంటి..?
  • ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చిన విషయంలో PSలో FIR చేసిన ఆ అవినీతి అధికారిపై చర్యలు లేకుండా కాపాడుతున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి తీసుకున్న లక్షల రూపాయల లంచం డబ్బు ఎవరి అకౌంట్ లకు పోయింది..?
  • కార్పొరేట్ ఆస్పత్రులకు కొమ్ముకాస్తున్నా ఆ అవినీతి అధికారి ఎవరు..?
  • ఎక్కడ.. ఎక్కడ.. ఎవరు.. ఎవరు.. బహుళ అంతస్తుల భవనాలు కట్టినారు..?
  • పిసిబిలోకి రాక ముందు ఏంటి..? వచ్చాక వీరి జీతం ఎంత.. ఇప్పుడు వీరు.. వీరి బినామీల పేరు మీద సంపాదించిన అక్రమాస్తులు ఎంత..? నిజ నిజాలు తేల్చేద్దాం..
  • దొడ్డి దారిలో ప్రమోషన్స్ పొందినది ఎవరు..? అసలు ప్రమోషన్స్ రావాల్సింది ఎవరికి..?
  • పిసిబిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతూ త్వరలో సీఎం, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలవనున్న పలువురు పర్యావరణ వేత్తలు..
  • పిసిబిలో మేం ఏం చేసిన మాకు తిరిగే లేదు అని విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • గతంలో ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చిన.. డబ్బులతో మేనేజ్ చేసి అడ్డదారిలో ప్రమోషన్ పొంది.. అయినా మార్పురాని ఆ అవినీతి అధికారి ఎవరు..?
  • మేం ఎంత పెద్ద తప్పు చేసినా మా దగ్గర ఉన్న అవినీతి డబ్బుతో తప్పించుకుంటాం అనే ధీమనేనా ఈ అవినీతి అధికారులది..?
  • పరిశ్రమల వారికి అవినీతి పిసిబి అధికారులకు ఒకరి అవసరం ఒకరికి ఉన్నంత మాత్రానా పొల్యూషన్ బాధితులు, పేద రైతులు, అగ్ని ప్రమాదంలో చనిపోయిన కార్మికులు ఎలా పోయిన వీరికి పట్టదా..?
  • సంబంధిత శాఖ మంత్రి పైనే తప్పులు పెడుతున్నారు.. అంటే పిసిబి అధికారుల తప్పే లేదా..?
  • ఇలాంటి పిసిబి తెలంగాణ ప్రజలకు అవసరమా..?
  • ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఉద్యమం చేయక తప్పదా..?
  • ఈ విషయాలన్నింటిపై వరుస కథనాల ద్వారా త్వరలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.. తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం.. అవినీతి అధికారులపైనే మా పోరాటం..