భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోను: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించడం నా జీవితంలో గొప్ప విషయమని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటానికి అమెరికా సహకారం ఉంటుందని, అపాచీ, రోమియో హెలికాప్టర్ల కొనుగోలుతో పాటు మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.