తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేశారు. 45 మంది కీలక ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ జల సరఫరా, గ్రామీణ పారిశుద్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌ను నియమించారు. అలాగే గనులు, భూగర్భ శాఖల బాధ్యతలను అదనంగా కేటాయించారు. విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎం.దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, సాగునీటి శాఖ కార్యదర్శిగా ఈ.శ్రీధర్‌ను నియమించారు. ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను బదిలీ చేశారు. రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ బి.విజయేంద్రను సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘం కార్యదర్శిగా నియమించారు. అలాగే పలువురు జిల్లా కలెక్టర్లను కూడా మార్చారు.

బదిలీ అయిన 45 మంది ఐఏఎస్‌ల జాబితా

1. PR&RD, RWS & RSAD శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్
2. ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కీమ్స్ మరియు CSR ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సబ్యసాచి ఘోష్
3. విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (FAC)గా, రెవెన్యూ శాఖ ఎం. దాన కిశోర్
4. ఐటీ & పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్
5. పొలిటికల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
6. సాగునీటి & CAD శాఖ కార్యదర్శిగా ఈ. శ్రీధర్
7. ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా డా. గౌరవ్ ఉప్పల్
8. TGSWREIS కార్యదర్శి & ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా బి. విజయేంద్ర
9. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి. దివ్య (FAC)
10. తెలంగాణ భవన్ (న్యూఢిల్లీ) సమన్వయ ప్రత్యేక కార్యదర్శిగా అద్వైత్ కుమార్ సింగ్
11. ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా ఎం. హనుమంతరావు
12. ఫైనాన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సిక్తా పట్నాయక్
13. జనగాం జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా
14. 3వ డిస్కమ్ CMDగా ఎం.డి. ముషర్రఫ్ అలీ ఫారూఖీ
15. లేబర్ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పమెలా సత్పతి
16. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
17. కోఆపరేషన్ ప్రత్యేక కమిషనర్ & రిజిస్ట్రార్‌గా రాహుల్ రాజ్ పి.ఎస్
18. ITE&C శాఖ ప్రత్యేక కార్యదర్శిగా భవేష్ మిశ్రా
19. TGSPDCL CMDగా జితేష్ వి. పాటిల్
20. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్‌బాషా షేక్
21. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా సంతోష్ బి.ఎం
22. నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్
23. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబరిష్
24. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ MDగా పి. కాత్యాయిని దేవి
25. నారాయణపేట అదనపు కలెక్టర్‌గా జి. ఫణీంద్ర రెడ్డి
26. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా చిత్ర మిశ్రా
27. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరీమా అగర్వాల్
28. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారీ
29. మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్
30. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అంకిత్
31. హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్
32. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా
33. GHMC రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా మందా మకరందు
34. మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్
35. హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ MDగా శివేంద్ర ప్రతాప్
36. GHMC కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్
37. వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉమా శంకర్ ప్రసాద్
38. నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్
39. మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా పి. చంద్రయ్య
40. వరంగల్ అదనపు కలెక్టర్‌గా వై.వి. గణేష్
41. సిద్ధిపేట అదనపు కలెక్టర్‌గా అబ్దుల్ హమీద్
42. నిర్మల్ అదనపు కలెక్టర్‌గా బి. వెంకటేశ్వర్లు
43. వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఎన్. ఖీమ్యా నాయక్
44. Industry & Investment Cell & SPEED అదనపు CEOగా కె. విద్యాసాగర్
45. ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా ఎం. సురేందర్