తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న “ఫార్మా భూతం”

  • గాలి, నీరు, భూమి కలుషితం..
  • ఇంకా ఎంతకాలం ప్రజల ప్రాణాలతో చెలగాటం
  • కాలుష్యకారక పరిశ్రమలపై కానరాని చర్యలు
  • మొద్దునిద్రలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి
  • తెలంగాణ వ్యాప్తంగా కాలుష్య పరిశ్రమలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా పట్టించుకోని పిసిబి అవినీతి అధికారులు
  • పిసిబిలోని కొందరు అవినీతి అధికారుల అడ్డగోలు చేష్టలతో విసిగిపోయిన ఫిర్యాదుదారులు, పర్యావరణ వేత్తలు..
  • బ్యాంక్ గ్యారంటీలు ఫోర్ ఫీట్ చేయమని వేసిన పరిశ్రమల పేర్లు చెప్పడానికి వెనుకాడుతున్న పిసిబి అధికారులు..
  • భారీగా బ్యాంక్ గ్యారంటీలు వేస్తూ ఫోర్ ఫీట్ చేయకుండా పరిశ్రమలను కాపాడుతున్న అధికారులు ఎవరు..?
  • పరిశ్రమలకు భారీగా బ్యాంక్ గ్యారంటీలు వేస్తూ ఫోర్ ఫీట్ చేయకుండా బోర్డు ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారులు
  • కన్సల్టెన్సీల ద్వారా భారీగా లంచాలు తీసుకుంటున్న కొద్ది మంది పిసిబి అవినీతి అధికారులు ఎవరు..?
  • పిసిబి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్న అవినీతి అధికారులు ఎవరు..?
  • నిజాయితీ అధికారులతో తెలంగాణలోని పరిశ్రమలలో ఇన్స్ పెక్షన్ చేపిస్తే ఒక్క పరిశ్రమకు కూడా నడిపే అర్హత ఉంటదా..?
  • ఆర్.టి.ఐ. ద్వారా సమాచారం అడిగితే అసలు సమాచారం దాచి డొంక తిరుగుడు సమాధానం ఇవ్వడం వెనుకున్న మతలబు ఏంటి..?
  • ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చిన విషయంలో PSలో FIR చేసిన ఆ అవినీతి అధికారిపై చర్యలు లేకుండా కాపాడుతున్నది ఎవరు..?
  • ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి తీసుకున్న లక్షల రూపాయల లంచం డబ్బు ఎవరి అకౌంట్ లకు చేరింది..?
  • కార్పొరేట్ ఆస్పత్రులకు కొమ్ముకాస్తున్నా ఆ అవినీతి అధికారి ఎవరు..?
  • గతంలో ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చిన.. డబ్బులతో మేనేజ్ చేసి అడ్డదారిలో ప్రమోషన్ పొంది.. అయినా తీరుమార్చుకోని ఆ అవినీతి అధికారి ఎవరు..?
  • మేం ఎంత పెద్ద తప్పు చేసినా మా దగ్గర ఉన్న అవినీతి డబ్బుతో తప్పించుకుంటాం అనే ధీమనేనా ఈ అవినీతి అధికారులది..?
  • పరిశ్రమల వారికి అవినీతి పిసిబి అధికారులకు ఒకరి అవసరం ఒకరికి ఉన్నంత మాత్రానా పొల్యూషన్ బాధితులు, పేద రైతుల గోడు వీరికి పట్టదా..?
  • తూ తూ మంత్రంగా కొన్ని పరిశ్రమలను క్లోజ్ చేస్తే తెలంగాణలో పర్యావరణం బాగుపడుతుందా..?
  • క్లోజర్ ఆర్డర్ ఇచ్చిన పరిశ్రమలకు వెంటనే రీవొకేషన్ ఇవ్వడం వెనుక ఉన్న రహస్యం ఏంటి..?
  • పిసిబిని ప్రక్షాళన చేయకుంటే తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుకోలేమా..?
  • ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కొందరు పిసిబి అవినీతి అధికారులు
  • సీఎం దృష్టి పెడితేనే తప్ప.. పిసిబి అధికారులు దారిలోకి రారా…
  • ఇలాంటి పిసిబి తెలంగాణ ప్రజలకు అవసరమా..?
  • పిసిబిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కాలుష్య బాధితులు, రైతులు, మేధావులు, పర్యావరణ వేత్తలు ఉద్యమం చేయక తప్పదా..?
  • ఈ విషయాలన్నింటిపై వరుస కథనాల ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాం.. తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం.. అవినీతి అధికారులపైనే మా పోరాటం..

తెలంగాణ వ్యాప్తంగా విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలి గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నప్పటికీ ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో పిసిబి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామాలలో ఫార్మా భూతం విస్తరిస్తుంది. కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ నగర పరిసరాల్లోంచి దూరంగా తరలించాలని ఇటీవలి కాలంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి మూకుమ్మడిగా చెబుతున్నారు, నగరానికి దూరంగా అంటే ఎక్కడికి..? ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ అవతలికి మార్చాలని వారే స్పష్టంగా చెబుతున్నారు. ఇంకా చిత్రం ఏమంటే కోర్టులు కూడ అదే మాట చెప్తున్నాయి.

నగరంలో కాలుష్యం వద్దు అనేది బాగానే ఉంది, కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కానీ కాలుష్య కారక పరిశ్రమలను ఎక్కడకు తరలించాలి, ప్రజలు నివసించే చోటుకి తరలించాలా ! ప్రజలు లేని చోటుకి తరలించాలా అనేది స్పష్టం చేయడం లేదు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ బయటకు అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి తరలించాలనేది ప్రభుత్వ ఉద్దేశమా..! ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాలలో ప్రధానంగా చౌటుప్పల్ డివిజన్ లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమల వల్ల పీల్చే గాలి, త్రాగే నీరు, పంట భూములు, భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండకపోగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అసలే నల్లగొండ జిల్లా ఫార్మా డంపింగ్ యార్డ్ గా మారుతున్నది. గతంలో పటాన్ చెరువు, బాలానగర్, బొల్లారం, కూకట్ పల్లి ప్రాంతాలను విషతుల్యం చేసిన ఫార్మా పరిశ్రమలు ఇప్పుడు జిన్నారం, సంగారెడ్డి, గడ్డ పోతారం, పాశమైలారం జెడ్చర్ల సెజ్, చౌటుప్పల్, అంతమ్మగూడెం, దొతిగూడెం, పోచంపల్లి, బీబీనగర్, చిట్యాల మండలాలను ముంచెత్తుతున్నాయి. పరిశ్రమల చుట్టూ ఉన్న భూమిని, చెట్ల ఆకులను, గాలిని, భూగర్భజలాలు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ప్రపంచ దేశాలు ఫార్మా పరిశ్రమలను వదిలించుకుంటున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు అక్కడ ఫార్మా యూనిట్లను మూసివేసి మనదేశంపై పడుతున్నాయి. మనదేశాన్ని ఫార్మా, వాక్సిన్లకు ప్రయోగశాలగా మార్చుకుంటున్నట్లు అక్కడ దేశాలే చెప్తున్న విషయం తెలిసిందే. మనం ప్రపంచమంతా మేలుకున్నాక చివరగా మేలుకుంటాం. ఇతర దేశస్తులు మన దగ్గర పెట్టుబడులు పెడతామంటే వారు దేనికి పెట్టుబడులు పెడతారు అనేది పాలకులు ఆలోచించకుండానే స్వాగతం పలకడం పట్ల కాలుష్య బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరైడు భూతాన్ని ఇప్పుడిపుడే వదిలించుకుంటున్నాం. ఇప్పుడున్న కాలుష్యం చాలదన్నట్లు మళ్ళీ కొత్తగా మరింత కాలుష్యం ఉమ్మడి జిల్లాపై రుద్దుతారా? ఇటీ వలే ఒక కంపెనీలో పేలుడు సంభవించి కెమిస్ట్ ఒకరు కాలి బూడిద అయిపోయారు. మరికొన్ని చోట్ల కంపెనీలలో రియాక్టర్లు పేలి పలువురు గాయపడడంతో పాటు పరిసర గ్రామాలలోని ఇండ్లు దెబ్బతిన్నాయి. మరి కొన్ని పరిశ్రమలు అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. కాలుష్యానికి తోడు ఫార్మా కంపెనీలలో తరచుగా పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మన దగ్గర ఇప్పుడున్న కాలుష్య కారక ఫార్మా కంపెనీలను మూసివేయాలని, వీలు కాకపోతే మరోచోటకు తరలించాలని కాలుష్య బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలో చేస్తుండగా పాలకులు అవేవీ పట్టించుకోకుండా ఫార్మా భూతాన్ని ఇంకా పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తుండడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, సామాజిక సంస్థలు కాలుష్యకారక పరిశ్రమలను అడ్డుకొని ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలను, గాలి, నీరు, పంటలను కాపాడవలసిన అవసరం ఉంది.