యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి

  • జులై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలి
  • పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల DPR లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ను సమర్పించాలి
  • ఉగాదిలోగా పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు శంకుస్థాపన చేయాలి .
  • సింగూరు ప్రాజెక్టు సుందరీకరణ, ప్రాజెక్టు పరిరక్షణ పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలి
  • సింగూర్ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తిచేయాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆదేశం.

రాష్ట్ర సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు, ENC లు , ఇంజనీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సింగూరు డ్యాం సేఫ్టీ పై రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ వెంకటస్వామిలు చర్చించారు. డ్యామ్ సేఫ్టీ ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యత అంశం అన్నారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూర్ డ్యాం ను పరిరక్షించాలని మంత్రులు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. సింగూరు డ్యామ్ సేఫ్టీ నిర్మాణ పనులపై టెక్నికల్ కమిటీని నియమించాలని మంత్రులు ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

ఆందోల్ నియోజకవర్గం లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం DPR లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను పనులకు ఉగాదిలోగా శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టాలని మంత్రులు ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సింగూర్ ప్రాజెక్టు సుందరీకరణ , పరిరక్షణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు దామోదర్ రాజనర్సింహ ఉత్తంకుమార్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆందోల్ నియోజకవర్గం లో చిన్న నీటి ప్రాజెక్టులైనా చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ శ్రీధర్, ఈఎన్సీలు రమేష్ బాబు, శ్రీనివాస్, టి.శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ SE బి రాజమ్మ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, ఇన్చార్జి ఎస్సీ రఘునాథ్ రావు, ఈ ఈ బీమ్, DE నాగరాజ్, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.