
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అటవీశాఖ రంగారెడ్డి జిల్లా కమిషనర్ సునీతా భగవత్ మహేష్ కోరారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని గోపలాయపల్లి, ఔరవాణి గ్రామాల్లో జరుగుతున్న పనులను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. మొదట మొక్కలు నాటి గ్రామంలో జరిగిన ప్రగతిని పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించాలని ఆదేశించారు. వైకుంఠధామం, నర్సరీలు, డంపింగ్‌యార్డులు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆమె నవతెలంగాణతో మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని చెప్పారు. ఆమె వెంట ఎంపీడీఓ మంగళపల్లి సాంబశివరావు, పంచాయతీ అధికారి బొమ్మ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ గొసుల భద్రాచలం, అటవీ శాఖ బీట్ అధికారి నర్మద, ఉపాధిహామీ ఏపీఓ యాదయ్య, పాలకుర్తి లక్ష్మయ్య, పంచాయతీ రాజ్ ఏఈ పాల మోహన్, అశోక్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మంగమ్మ, హెచ్ఎం దుర్గా, అవురావాణి సర్పంచ్ మాదగొని అండాలు, నరసింహా, ఈసీ రాంబాబు పాల్గొన్నారు.