
రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్సోట్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మృతదేహాలను బయటకు వెలికితీస్తున్నారు. ఘటనాస్థలి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.