ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రసిద్ధి చెందిన నెట్ ఫ్లిక్స్, ఐలైన్ హైదరాబాదుకు రావడం స్వాగతనీయం. తెలంగాణ ప్రజా ప్రభుత్వం తరపున.., నెట్‌ఫ్లిక్స్, ఐలైన్‌కు హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాను. డివిడి అద్దె సంస్థ నుండి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే… సంభ్రమాశ్చర్యంతో పాటు చాలా ఆదర్శంగా అనిపిస్తుంది. అంతటి ప్రసిద్ధి చెందిన నెట్ ఫ్లిక్స్, ఐలైన్ సంస్థలకు సొంత ప్రదేశంగా ఉంటుందని భావిస్తున్న. ఎందుకంటే, నెట్ ఫ్లిక్స్ కు, హైదరాబాదుకి సామీప్యత కూడా ఉంది అన్నారు. నెట్ ఫ్లిక్స్, హైదరాబాదు రెండింటి వృద్ధి అంతర్జాతీయంగా దినదిన ప్రవర్థమానం అవుతున్నది. నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, మంచి కంటెంట్‌ను సేకరించి వీక్షకులకు అందిస్తుంది. అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే నెట్‌ఫ్లిక్స్ ధ్యేయం. ప్రపంచ సంస్థలకు వేదిక అవుతూ… అన్ని రకాల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమే హైదరాబాద్ లక్ష్యం. నెట్‌ఫ్లిక్స్ కు హైదరాబాద్ అవసరమైన అవకాశాలను తప్పక కల్పిస్తుందన్నారు. తెలంగాణ, నెట్ ఫ్లిక్స్ రెండు కూడా మార్పును స్వీకరిస్తూ ముందుకు కదులుతాయి. నిజాం కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ఆహ్లాదకరమైన నగరంగా హైదరాబాద్ అలరారిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు హైదరాబాద్ ఎన్నో రంగాల్లో ఎదిగింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ ను, హైదరాబాదు అందరూ ప్రేమిస్తారు. ఎందుకంటే, … ఈ రెండు ఎంతోమందికి ఫుడ్, ట్రావెల్, హిస్టరీ, హెరిటేజ్, సంస్కృతి, సాంప్రదాయాలను అందిస్తుంటాయి. నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ ఇక్కడకు రావడంతో ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు, విషయాలు చూపించే అద్భుత అవకాశం దొరుకుతుంది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల క్రీడలపై చాలా దృష్టి పెట్టిందని తెలిసింది. త్వరలో, రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ క్రీడా ప్రసార సంస్థగా మారుతుందని భావిస్తున్నాం. తెలంగాణ కూడా క్రీడలపై కూడా కీలకంగా దృష్టి కేంద్రీకరించింది. క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించడం, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, క్రీడలకు సంబంధించి అన్ని స్థాయిలలో ప్రతిభను ప్రోత్సహించడం చేస్తున్నాం. ఇందుకు నెట్ ఫ్లిక్స్ సహకారం కావాలి. నెట్ ఫ్లిక్స్, హైదరాబాద్ రెండు గ్లోబల్ స్థాయిలో… దాంతోపాటు లోకల్ స్థాయిలో కలసి పెద్ద ఎత్తున విజయాలు సాధిస్తాయని తెలంగాణ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ప్రపంచ ఎంటర్‌న్‌మెంట్ ఇండస్ట్రీలో ఇండియా, తెలంగాణ ఎంతటి పాత్రను పోషించబోతున్నాయో తెలిపేందుకు ఈరోజు జరిగిన కార్యక్రమమే ఒక పెద్ద ఉదాహరణ.