పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం మరియు ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని, ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.