నల్లగొండ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

నల్గొండ మున్సిపాలిటీ చైర్మెన్ గా మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ గా అబ్బగోని రమేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్ తన తొలి సంతకాన్ని మేరకు రూపాయికే నల్లా కనెక్షన్ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీచైర్మెన్ నేతి విద్యాసాగర్, నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి హాజరైనారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, మాజీ శాసన మండలి సభ్యులు పూల రవీందర్, నాయకులు వేమిరెడ్డి నర్సింహ్మా రెడ్డి, చకిలం అనిల్ కుమార్, ICDS RO మాలె శరణ్యా రెడ్డి, రేఖల భద్రాద్రి, RDO జగదీశ్వర్ రెడ్డి, మున్సిపాలిటీ కమీషనర్ దేవ్ సింగ్, కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.