శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం

  • మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి ఆహ్వానించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో, అర్చకుల బృందం
  • మంత్రి దంపతులను మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించిన ఆలయ అర్చకులు
  • బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానపత్రికను మంత్రి వాకిటి శ్రీహరికి అందజేసిన ఆలయ ఈవో

రాబోయే మార్చి 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో,ఆలయ అర్చకుల బృందం ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో మంత్రి వాకిటి శ్రీహరి దంపతులను ఆశీర్వదించారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక వేడుక అని ఆలయ అధికారులు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి భద్రాచలం శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో భద్రాచలం ఆలయం ఈవో దామోదర్‌, ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీనివాస రామానుజం, రామాయణంపారాయణుడు అంతర్వేదికృష్ణమాచార్య, AEO భవానీ రామకృష్ణలు ఉన్నారు.