- అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ద పరిస్థితిల ప్రభావంతో ఎల్.పి.జి సరఫరాపై అప్రమత్తమైన ప్రభుత్వం
- బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే సహించేది లేదు
- డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ కు వాడితే చర్యలు కఠినం
- భయాందోళనతోటే బుకింగ్స్ రెట్టింపు
- పౌర సరఫరాల శాఖా భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ఫిర్యాదుల స్వీకరణకు గాను1800-428-00-333 టోల్ ఫ్రీ నెంబర్
- పరిస్థితిల పర్యవేక్షణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు
- కమర్షియల్ గ్యాస్ సరఫరా పై హోటల్&రెస్టారెంట్ అసోసియేషన్ ఫిర్యాదు
- గృహ వినియోగం,ఆసుపత్రిలు,పాఠశాలలు, వృద్దాశ్రమాలు,సంక్షేమ సంస్థలకు ఫిర్యాదు
- కమర్షియల్ సిలిండర్ల సరఫరా 20% నికే అందుతోంది
- గృహ వినియోగదారులకు సరఫరా నిలకడగా సాగేందుకు చర్యలు
- సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ భేటీ
రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా కేవలము 20% నీకే పరిమితం అయిన నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా కమర్షియల్ ఎల్.పి.జి కేటాయింపులు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ పరిస్థితిల ప్రభావం ఎల్.పి.జి సరఫరా పై చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని వైపులా చర్యలకు ఉపక్రమించిందని ఆయన తెలిపారు. తాజాగా ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితిలలో ఎల్.పి.జి సిలిండర్లను బ్లాక్ చెయలని చూస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. తాజా పరిస్థితులు నేపద్యంలో గృహ వినియోగదారులతో పాటు వసతిగృహాలు,ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రిలకు కొరత లేకుండా చూసేందుకు గాను ప్రభుత్వం నిఘా తీవ్రతరం చేసిందని ఆయన చెప్పారు. అయితే ఎక్కువ మంది గృహ వినియోగదారులు గ్యాస్ దొరకదన్న గందరగోళంతో బుకింగ్లు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయని ఆయన వివరించారు.
ఎల్.పి.జి సిలిండర్ల సరఫరాలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎల్.పి.జి సిలిండర్ల సరఫరాపై ఏర్పడ్డ పరిస్థితిలను శుక్రవారం రోజున రాష్ట్రంలోనీ కలెక్టర్లు,ఎస్.పి లు సి.ఎస్ రామకృష్ణా రావు లతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం ఎల్.పి.జీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ పరపస్ లో వినియోగిస్తే చర్యలు కఠినాతి కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా సృష్టించిన గందరగోళ పరిస్థితిలతో అయోమయం పాలైన వినియోగదారులు అవసరానికి మించి బుక్ చేసుకోవడంతోటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యిందన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలు సంక్షేమ సంస్థలు, ఇతరత్రా ప్రజాపయోగ కార్యక్రమాలకు సరఫరా లో ఆటంకాలు తలెత్తితే పౌర సరఫరాల శాఖా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో 1800-428-00-333 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. అంతే గాకుండా పరిస్థితిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా 20% శాతానికి పరిమితం అయిన నేపద్యంలో ఇప్పటికే రాష్ట్ర హోటల్&రెస్టారెంట్ అసోసియేషన్ అధికారికంగా ఫిర్యాదు చేసిందన్నారు. ఆ క్రమంలోనే అదనపు కమర్షియల్ ఎల్.పి.జి కేటాయింపులకై కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.