కంపెనీలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి – ఎమ్మెల్యే కేపి వివేకానంద్

శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాగిల్లాపూర్ లో శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ పట్టణీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందని, కమ్యూనిటీలు బలపర్చడం, సమస్యల పరిష్కారం దిశగా వాటిని నడిపిస్తుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తి చేసుకుని సిబ్బందిని నియమిస్తు, వారితో కలిసి పట్టణ అభివృద్ధిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, ఇందులో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. శక్తి హర్మన్ – జిఐజెడ్ కంపెనీ తమ వంతు సహాయం అందించేందుకు ముందుంకు రావడం శుభపరిణామం అని, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వానికి సహరించడం ప్రశంసనియమన్నారు. విద్య, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్, మహిళ సాధికారత దిశగా కూడా కార్పొరేట్ కంపెనీలు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే వివేకానంద్ పిలుపునిచ్చారు.