తెల్లాపూర్‌లోని చెలికుంటలో కలుషిత నీటితో చేపలు మృతి

 తెల్లాపూర్‌లోని చెలికుంట పూర్తిగా డ్రైనేజీ నీటితో కలుషితం కావడంతో చేపలు మృతిచెందాయి. తెల్లాపూర్‌ నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ శుక్రవారం ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు దీనిపై ఫిర్యాదు చేశారు. చెలికుంటలోకి డ్రైనేజీ నీరు చేరుతుండడంతో కుంట పూర్తిగా కలుషితమై నీటి రంగు మారడంతో పాటు చేపలకు ఆక్సిజన్‌ అందక కుంటలో ఉన్న చేపలు మొత్తం మృతి చెందుతున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెల్లాపూర్‌ పరిధిలోని చెలికుంట, వనం చెరువు, మేళ్ల చెరువుల్లోకి డ్రైనేజీ నీరు వస్తుండడంతో చెరువులు కలుషితమవుతున్నాయని ఆయన తెలిపారు. చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ పైప్‌లైన్లు వేయాలని కోరారు.