- 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది
- సామాజిక మార్పున కు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి
- దక్షిణాది రాష్ట్రాలను బలహీన పరచడం కోసం కేంద్రం ద్రవిడ రాష్ట్రాలకు పన్నుల రూపంలో వచ్చే వాటాను తగ్గించింది
- రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకికరణ ప్రయత్నం జరుగుతుంది బహుజనులు ఏకం కావాలి ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి
- బీసీ సబ్ ప్లాన్ అంశంపై ఆలోచన చేస్తాం
- ఎన్ని అవాంతరాలు వచ్చినా సామాజిక న్యాయం కోసం ప్రజా ప్రభుత్వం నిటారుగా నిలబడి ఉంటుంది
- బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్ర వద్ద పెండింగ్లో ఉంది. కేంద్రం ఆమోదించి పంపుతుందని ఎదురు చూస్తున్నాం
కుల గణన చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ లెక్కలు పరిగణలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన రవీంద్ర భారతి తో ఏర్పాటు చేసిన మహాత్మా పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే పరిగణలో తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని తెలిపారు. కుల గణన చేయకుండా నియోజకవర్గాల విభజన చేపడితే ఫలితం మరోరకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున సామాజిక మార్పునకు నాంది పలుకుతున్నాయని, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని ద్రవిడ రాష్ట్రాలను బలహీన పరిచేందుకు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో భారీగా తగ్గింపులు చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపేనా ఒక రూపాయి కేంద్రానికి వెళితే తిరిగి రాష్ట్రానికి 37 పైసలు మాత్రమే వస్తుందని, తమిళనాడు నుంచి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి 29 పైసలు, కేరళ నుంచి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి 61 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. అదే ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్ నుంచి కేంద్రానికి రూపాయి వెళితే తిరిగి కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి 6.53 రూపాయలు వెళుతున్నాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి పన్నుల వాటాల రూపంలో 2.17 రూపాయలు వెళుతున్నాయని డిప్యూటీ సీఎం వివరించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల జరుగుతున్న వివక్ష, కేంద్రం ఉద్యమాలను కట్టడి చేస్తున్న తీరు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజనలో కుల గణన ను పరిగణలోకి తీసుకోకపోతే యావత్ భారత దేశంలోని బలహీన వర్గాలకు నష్టం జరుగుతుందని, మనకోసం మనం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజా ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రజలే కేంద్రంగా నిధులు కేటాయించింది ఇదే జరిగితే తమకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని భావించి రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకికరణ ప్రయత్నం జరుగుతుందని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. బహుజనులు ఏకం కావాలి ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ అమల్లోకి తీసుకువచ్చింది బీసీ సబ్ ప్లాన్ డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆలోచన చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
అంతరాలు లేని సమాజం కోసం జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలి, జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేసినప్పుడే సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎన్ని అవాంతరాలు వచ్చినా నిటారుగా నిలబడుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. భారతదేశంలో కులం అనేది వాస్తవం అధికారంలోకి రాగానే కుల సర్వే చేపడతామని మా నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ప్రకటించారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల సర్వే చేసి రాష్ట్రంలో 56% మంది బీసీలు ఉన్నారని తమ ప్రభుత్వం లెక్క కట్టి చెప్పిందని తెలిపారు. వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు కుల సర్వే చేశారు ఆ తర్వాత దేశంలో కుల సర్వే చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
కుల సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపాం, ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపగా అక్కడ బిల్లు పెండింగ్ లో ఉందని తెలిపారు. కేంద్రం ఆమోదించి పంపితే కుల సర్వే ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ సామాజిక స్పృహతో పాలన అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నారు. మహాత్మ పూలే ఆలోచనలను ఏ చిన్న అవకాశం దక్కిన, ప్రతి సందర్భంలో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
కుల వివక్ష, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కుంగిపోకుండా తట్టుకొని నిలబడాలి అని ఆచరించి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలబడ్డారు అందుకే మహాత్మా ఫూలే మహానుభావుడు అయ్యారు అని తెలిపారు. మిత్రుడు పెళ్లికి వెళితే మైల పడిందని శుద్ధి చేసి పంపితే ఆ అవమానం భరించలేక సమాజ మార్పు కోసం మహాత్మా పూలే మొదలుపెట్టిన అడుగుల శబ్దం ఇప్పటికీ వినపడుతుంది అన్నారు. మార్పు కోసం మనం అంతా నడుం బిగించి అవకాశం దొరికిన ప్రతి సందర్భాన్ని వినియోగించుకోవాలి అన్నారు. అంతరాలు లేని సమాజం విద్యుత్ ద్వారానే సాధ్యమని మహిళల కోసం పాఠశాల లేకపోతే తన శ్రీమతిని హెడ్మాస్టర్ గా మార్చి పాఠశాల నిర్మాణం చేసి సమాజా మార్పుతో పాటు లింగ వివక్షపై కూడా మహాత్మా పూలే యుద్ధం చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. అంతరాలు లేని సమాజం నిర్మాణానికి చిన్ననాటి నుంచే పునాదులు వేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓసి అన్ని వర్గాల పిల్లలు 12వ తరగతి వరకు ఒకే చోట చదువుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి రాగానే 40 శాతం డైట్ 200% కాస్మోటిక్ చార్జీలు పెంచామని, మన బిడ్డలు ఎవరు అర్ధాకలితో ఉండకూడదనే మంచి ఉద్దేశంతో ప్రతిరోజు నాణ్యమైన డైట్ ను అందించడమే కాదు వాటిని పర్యవేక్షించేందుకు చీఫ్ సెక్రటరీ నుంచి మండల స్థాయి అధికారి వరకు సీఎం నుంచి సర్పంచి వరకు గురుకులాలు సంక్షేమ వసతి గృహాలు సందర్శించాలి అవసరమైతే అక్కడే నిద్రించాలని నిబంధన పెట్టి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం పథకం ప్రారంభిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 15 కోట్లతో సకల సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంటేనే అంతరాలు లేని సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మిన ప్రజా ప్రభుత్వం తాజా బడ్జెట్లో విద్యాశాఖకు 13.5% నిధులు కేటాయించాం ఇది విద్య పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, ఆలోచన అన్నారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించామని తెలిపారు. కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.