చదువు పూర్తై, నిరుద్యోగంతో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న యువతీ.. యువకులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం 29న జాబ్మేళా నిర్వహించనున్నది. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి అధికారి జి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు తమ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లు తీసుకొని, జాబ్ మేళాకు హాజరవ్వాలని సూచించారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు, ప్లేస్ మెంట్ కల్పిస్తామని ఆమె తెలియజేశారు. మరిన్ని వివరాలకు 99597 33360, 95730 02090 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.