గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై పౌరసరఫరాల సంస్థ దాడులు

  • రూ 1·50 కోట్ల విలువైన డొమెస్టిక్ సిలిండర్ల స్వాధీనం
  • గత నెల రోజుల్లో 2,089 కేసులు నమోదు
  • సిలిండర్ల అక్రమ నిల్వ, డెలివరీలో జాప్యంపై టోల్ ఫ్రీ నెంబర్:1967 కు కాల్ చేయాలి

గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు
గ్యాస్ సిలిండర్ల ను అక్రమ నిల్వ, పక్కదారి పట్టించే వారిపై అధికారులు నిఘా ఉంచి, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా ప్రక్రియ నిబంధనల ప్రకారం సకాలంలో జరిగేందుకు బుకింగ్స్ & డెలివరీలను కమాండ్ కంట్రోల్ ద్వారా ఆయా ఏజెన్సీ లతో రోజువారీగా చెక్ చేస్తున్నారు. గత నెల రోజులుగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, మరో 70 చిన్న సిలిండర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 1 కోటి 50 లక్షలు ఉన్నది. ఈ సందర్భంగా 2,089 కేసులు నమోదు చేశారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపు, డెలివరీ లో జాప్యంపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్:1967 కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.