లహుజీ సాళ్వె పుస్తకాన్ని ఆవిష్కరించిన పర్యాటకం & సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు

ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ సెక్రటేరియట్ లో తన కార్యాలయంలో ప్రొహిబిషన్ & ఎక్సయిజ్, పర్యాటకం, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణా రావు తన కార్యాలయంలో క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె పుస్తకాన్ని ఆవిష్కరించారు.
చంద్రకాంత్ వాన్ ఖేడ్ రచించిన మరాఠీ పుస్తకంను గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ తెలుగులో అనువాదం చేయగా, తెలంగాణ సాహిత్య అకాడెమీ ద్వారా ప్రచురించడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ వివాహం చేసుకోకుండా జీవితాన్ని దేశం సమాజ సేవకు అంకితం చేసి వేలాదిమంది స్వాతంత్య్ర పోరాట వీరులను తయారుచేసిన క్రాంతిగురు లహుజీ సాళ్వె. అయన మహాత్మా జ్యోతిబా ఫూలే కు గురువు కూడా. ఫూలేకు అండగా ఉండి ఆ కాలంలో విద్యా సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయుటలో ప్రముఖ పాత్ర పోషించారు. లహుజీ సాళ్వె చరిత్ర తెలుగు వారికీ కూడా అందుబాటులో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడెమీ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం ద్వారా అయన చరిత్రను, అయన కృషిని తెలుసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకొనివెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా.నామోజు బాలచారి ( కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడెమీ), జంగిటి వెంకటేష్ (సీనియర్ జర్నలిస్ట్), యు.నాగార్జున, గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ (రచయిత), సోమశిల తిరుపాల్ (సాహితీవేత్త) పాల్గొన్నారు.