ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండుగూడెంలో ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడెంలో ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. గోండు గూడ నుంచి 5 బస్సుల్లో బయలుదేరిన హైదరాబాద్ కు 200 మంది ఆదివాసీలు. మధ్యాహ్యం 1 గంటకు హైదరాబాద్ లోని తారామతి బారాదరికి చేరుకోనున్న ఆదివాసీ పర్యాటకులు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పివో యువరాజు మర్మ ట్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సక్కు, సోయం బాపురావు, ఆడే గజేందర్, తదితరులు పాల్గొన్నారు