- జనగణన తో పథకాల ప్రయోజనాలు సరిగ్గా అందుతాయి
జనగణన (Census 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self-Enumeration) కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో వెబ్ సైట్ ద్వారా ఆయన తన వివరాలను నమోదు చేసుకున్నాను. రాష్ట్రంలోని ప్రజలందరు జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ విధానం ద్వారా జనగణనలో సమాచార సేకరణ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో జనగణన 2027 ప్రక్రియలో భాగంగా, ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సరిగ్గా అందుతాయని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, చీఫ్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, టెక్నీకల్ అసిస్టెంట్ హిమవర్ష తదితరులు పాల్గొన్నారు.