సచివాలయంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో బ్బాగంగా నెదుట రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక శాఖ, ఎస్.ఫై.ఎఫ్ లు సంయుక్తంగా అగ్నిప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాయి. సచివాలయం లోని అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ అవగాహన కార్యక్రమంలో అగ్ని భద్రతా చర్యలపై అవగాహన తోపాటు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై అగ్ని భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక అగ్ని భద్రతా చర్యలు, ఎవాక్యుయేషన్ డ్రిల్స్ విధానం, అత్యవసర ప్రతిస్పందన విధానాల ప్రాముఖ్యతపై వివరంగా అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే మూలాలు, అగ్ని భద్రత, , రక్షణ చర్యలను లైవ్ డిమానిస్ట్రేషన్ ద్వారా వివరించారు.ఈ సంద్రాభంగా అగ్నిమాపక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనారాయణ, సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవీదాస్, .డీ.ఎఫ్.ఓ లు వెంకన్న, శ్రీనివాస్, ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా, తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ బృందాలచే ప్రత్యక్ష ప్రదర్శనలు (లైవ్ డెమోస్), మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫైర్ హైడ్రెంట్లను ఉపయోగించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో ఎవాక్యుయేషన్ విధానాలపై శిక్షణ ఇచ్చారు. అగ్నిప్రదాం సంభవిస్తే చేపట్టాల్సిన చర్యలు, లిఫ్ట్ లను ఉపయోగించకపోవడం, కేవలం మెట్ల మార్గం ద్వారానే వెళ్లడం తదితర చర్యలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.