జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు

జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్‌ జడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థినులతో భాస్కర్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అసభ్యంగా మాట్లాడిన దృశ్యాలను వీడియో తీసిన రాజలక్ష్మీ అనే ఉపాధ్యాయురాలు వాటిని షేర్‌ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో విచారణ చేపట్టిన డీఈవో ఇద్దరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.