జడ్చర్ల మున్సిపల్‌ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

  • కాంట్రాక్టర్ల నుంచి నగదు, సిబ్బంది సెల్‌ఫోన్లు స్వాధీనం

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపల్‌ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివరాలను సేకరించారు. సిబ్బందితో పాటు అక్కడున్న కాంట్రాక్టర్లను తనిఖీ చేశా రు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.50 వేలు, మరొకరి వద్ద రూ.15 వేల నగదుతోపాటు సిబ్బంది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.