ఇంజనీరింగ్ అద్భుతం ఈ భారీ సర్జ్ పూల్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన భారీ సర్జ్‌పూల్‌ నీటి నిల్వకు సిద్ధం అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ గుట్టల మధ్య కాళేశ్వరం 10వ ప్యాకేజీలో భాగంగా దీనిని నిర్మించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌ ఇది. ముప్ఫై అంతస్తుల భవనం అంత లోతు, 18 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో దీని వ్యాసార్థం అంత. ఈ సర్జ్‌పూల్‌ను కేవలం 13 నెలల్లోనే పూర్తి చేయడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తెలంగాణ ఆత్మ గల్ల నాయకుడు ఉంటే ఇటువంటి అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు.