అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ‘ఇక్కత్’ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈనెల 5,6,7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.
పోచంపల్లి చేనేత కళాకారుల జీవన ప్రమాణాల మెరుగుపరిచే లక్ష్యంతో జూన్ 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో ‘త్రెడ్ పోచంపల్లి’ పేరిట వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచేందుకు ఏర్పాటు చేసే ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 100 పైగా స్టాల్స్, మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.