
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు పాలకమండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఈసీ) సభ్యులను నియమించింది. ఉస్మానియా, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ, జేఎన్‌యూఎఫ్‌ఏ యూనివర్సిటీలవారీగా శుక్రవారం వేర్వేరు జీవోలు జారీచేసింది. పాలకమండలి సభ్యుల్లో ఐదుగురు ఎక్స్‌అఫీషియో, నలుగురు ప్రముఖులతో కలిపి మొత్తం తొమ్మిది మందిని నియమించింది. వర్సిటీ పాలకమండలి సభ్యుల నియామకాల్లో అన్నివర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారని ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. వర్సిటీల్లో అభివృద్ధి, విద్యా సంబంధ అంశాల్లో పాలకమండళ్లు కీలకపాత్ర పోషిస్తాయి.
ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు
ప్రొఫెసర్ వీ అప్పారావు, ఓయూ, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్; ప్రొఫెసర్ ఎం కుమార్, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఓయూ; డాక్టర్ పీ బాలభాస్కర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నారాయణగూడ; ప్రొఫెసర్ సయ్యద్ తలాత్ సుల్తానియా, అరబిక్ డిపార్టుమెంట్, ఓయూ; ఎం ప్రవీణ, తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి; కే రత్నాకర్‌రెడ్డి, హెటిరో డ్రగ్స్; ఎస్వీసీ ప్రకాశ్, శ్రీమిత్రా అండ్ వెన్నెల కాలేజీ, ముస్తాఫాబాద్, రాజన్న సిరిసిల్ల; పెర్క శ్యాం, ఓయూ (సిద్దిపేట); ఎంఏ ముఖీద్ (అడ్వొకేట్)
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పాలకమండలి సభ్యులు
ప్రొఫెసర్ కే అంజిరెడ్డి, ఎకనామిక్స్ డిపార్టుమెంట్, ఎంజీయూ; డాక్టర్ ఆకుల రవి, కామర్స్ డిపార్టుమెంట్, ఎంజీయూ; డాక్టర్ జ్ఞానశ్యాం, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (మహిళా), నల్లగొండ; డాక్టర్ కే శ్రీదేవి, కామర్స్ డిపార్టుమెంట్, ఎంజీయూ; డాక్టర్ కోయి కోటేశ్వరరావు, తెలుగు డిపార్టుమెంట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (మహిళ); బోయపల్లి కృష్ణారెడ్డి; సవిందర్‌కుమార్ (అడ్వొకేట్); బీ సూర్యనారాయణరెడ్డి, భువనగిరి; సోమ రమేశ్
శాతవాహన యూనివర్సిటీ (ఎస్‌యూ) పాలకమండలి సభ్యులు
శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ ఎం భారత్; డాక్టర్ డీ సురేశ్‌కుమార్, గోదవారిఖనిలోని యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్; డాక్టర్ రామకృష్ణ, కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్; డాక్టర్ ఎం వరప్రసాద్, ఎస్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్ అకడమిక్ ఆడిట్; వంగపల్లి ఉమాదేవి, కరీంనగర్ శివాని డిగ్రీ, పీజీ కాలేజీ; చిట్టిమల్ల శ్రీనివాస్, ప్రెసిడెంట్, చాంబర్ ఆఫ్ కామర్స్, కరీంనగర్; ఐలినేని దీపిక, కరీంనగర్ వాణినికేతన్ విద్యాసమితి; వేణు పెట్టం, చైర్మన్, అపూర్వ విద్యాసంస్థలు, కరీంనగర్; కే మొగిలయ్య, హుజూరాబాద్
తెలంగాణ యూనివర్సిటీ (టీయూ) నిజామాబాద్, పాలకమండలి సభ్యులు
ప్రొఫెసర్ నసీం, ఫార్మాస్యూటికల్ డిపార్టుమెంట్, టీయూ; డాక్టర్ సీహెచ్ ఆరతి, ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, కంప్యూటర్ సైన్స్, టీయూ; డాక్టర్ కే ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఎల్లారెడ్డి; డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఎకనామిక్స్ డిపార్టుమెంట్, టీయూ; డాక్టర్ వీ వసుంధరాదేవి, ఉమెన్స్ కాలేజీ, కంఠేశ్వర్, నిజామాబాద్; పీ గంగాధర్‌గౌడ్; ఎన్‌ఎల్ శాస్త్రీ (అడ్వొకేట్); ఎం రాజేందర్; డాక్టర్ మారయ్యగౌడ్
మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ (పీయూ) పాలకమండలి సభ్యులు
ప్రొఫెసర్ కే గిరిజ మంగతాయారు, యూనివర్సిటీ పీజీ కాలేజీ, పీయూ; డాక్టర్ ఎండి నూర్జహాన్, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ సైన్స్ కాలేజీ, పీయూ; డాక్టర్ గోవింద్ భూషణ్, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీ, జడ్చర్ల; డాక్టర్ ఎన్ కిశోర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ పీజీ కాలేజీ, పీయూ; డాక్టర్ ఏ చంద్రోజీరావు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (మెన్), వనపర్తి; జీ గోపాల్, రిటైర్డ్ జీహెచ్‌ఎం; డీఎస్‌హెచ్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజీ (రిటైర్డ్); డాక్టర్ పీ జగదీశ్వర్, చైర్మన్, స్కాలర్స్ ఇన్‌స్టిట్యూట్, వనపర్తి; పీ ప్రసాద్‌రావు, డైరెక్టర్, వివేకానంద డిగ్రీ కాలేజీ, మహబూబ్‌నగర్
జేఎన్‌యూఎఫ్‌ఏ, మాసబ్‌ట్యాంక్ పాలకమండలి సభ్యులు
ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌ఎన్ వికాస్, ఐప్లెడ్ ఆర్ట్ డైరెక్టర్, జేఎన్‌యూఎఫ్; ప్రొఫెసర్ ఎస్ కుమార్, ప్రిన్సిపాల్, జేఎన్‌యూఎఫ్‌ఏ స్కూల్ ఆఫ్ ప్లానింగ్; ప్రొఫెసర్ మున్నవర్ పాషా, ప్రిన్సిపాల్, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీ; కే సుందర్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, సీవోఈ, జేఎన్‌యూఎఫ్‌ఏ; ప్రొఫెసర్ సుమన్ రేఖ, ఎస్‌ఎస్ ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫ్యాకల్టీ, సికింద్రాబాద్; లక్ష్మణ్ ఏలె; వీ మహేశ్‌గుప్తా, ఆర్కిటెక్ట్; రమణారెడ్డి, ఫైన్ ఆర్ట్స్; లక్ష్మీ నంబియర్
జేఎన్టీయూ కూకట్‌పల్లి హైదరాబాద్, పాలకమండలి
ఎస్ తారా కల్యాణి, ఆర్ మార్కండేయ, సీడీ నాయుడు, డాక్టర్ తాటిపర్తి విజయలక్ష్మి, జీ విష్ణుమూర్తి, వీ రాజన్న, శ్రీకాంత్ సిన్హా, అరుతియా ప్రశాంత్, మసూద్ హుస్సేన్