నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి ఎన్నిక

డిసిసిబి చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి లు ఏక్రగీవ ఎన్నిక
డిసియంయస్ చైర్మన్ గా వట్టి జానయ్య యాదవ్, వైస్ ఛైర్మన్ గా నారాయణ రెడ్డి లు ఎన్నిక
ఈ ఉదయమే నల్గొండ కు చేరుకున్న టిఆర్ఎస్ పార్టీ సహకార సంఘాల ఎన్నికల ఇంచార్జ్ శేరి సుబాష్ రెడ్డి. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన సుబాష్ రెడ్డి. ఇంచార్జ్ సుబాష్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశానుసారం పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు. అనంతరం డిసిసిబి, డిసియం యస్ పాలకమండళ్లను అధికారికంగా ప్రకటించిన అధికారులు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సహకార సంఘాల పరిపుష్టికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు
నల్గొండ జిల్లాలో డిసిసిబి, డిసియంయస్ లు నష్టాల్లో ఉన్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాలను పరిపుష్టం చేస్తాం
ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవ ఎన్నికలో సమిష్టి కృషి ఉంది
అందుకు సహకరించిన ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి,శాసనసబ్యులకు కృతజ్ఞతలు
అధిష్టానం రాష్ట్రాన్ని యూనిట్ గా చెసుకుని సమీకరణాలను పరగణలోకి తీసుకుంది
అందులో భాగమే నల్గొండ జిల్లా పాలకమండళ్లు ప్రకటన
జిల్లాలోని ప్రజాప్రతినిధులఅభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కే టి రామారావు కు ధన్యవాదాలు
ఇది రైతు ప్రభుత్వం
సహకార సంఘాల పరిపుష్టం ద్వారా టి ఆర్ యస్ రైతాంగానికి మరింత చేరువ అవుతోంది
సహకార రంగంలో డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి అపారమైన అనుభవం ఉంది
1987 నుండి ఆయన సహకార సంఘం అధ్యక్షుడిగా కొన సాగుతున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు సహకార సంఘం ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ గా నియమితులైన యం ఎల్ సి శేరి సుబాష్ రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,.కంచర్ల భూపాల్ రెడ్డి డా.గాదరి కిశోర్ కుమార్,,చిరుమర్తి లింగయ్య, యన్. భాస్కర్ రావు,రవీంద్ర నాయక్ బోనగిరి జడ్ పి చైర్మన్ ఏలిమినేటి సందీప్ రెడ్డి,మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు.