ఏపీ సీఎం జగన్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు సీఎం జగన్‌తో ముఖేష్‌ అంబానీ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖేష్‌ వెంట ఆయన తనయుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ఉన్నారు.