- జేసీఈఎస్(JCES-FAC)కు పీసీబీ ఏమైనా రెండు ప్రభుత్వ వాహనాలు కేటాయించిందా..!
- పీసీబీ చైర్మన్, మెంబర్ సెక్రెటరీ కంటే జోనల్ ల్యాబ్ వరంగల్ SES హైప్రొఫైల్
- PCB జోనల్ ల్యాబ్ వరంగల్ ప్రభుత్వ వాహనాన్ని SES కుటుంబ సభ్యులు తిరగడానికి ఇచ్చిందా..!
- ప్రతిరోజు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న వరంగల్ జోనల్ ల్యాబ్ ప్రభుత్వ అధికారిక వాహనం
- PCB ఉన్నతాధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ వాహన దుర్వినియోగం..
- ఇదంతా PCB ఛైర్మన్, మెంబర్ సెక్రటరీ(MS)కి తెలిసే జరుగుతుందా..?
- హైదరాబాద్ సెంట్రల్ లాబొరేటరీ ఉన్నతాధికారి (SES/JCES-FAC) తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు చేష్టలు..
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(PCB)లో జేసీఈఎస్(JCES-FAC/SES) హోదాలో ఉన్న ఓ ఉన్నతాధికారి మాత్రం తనకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో JCES-FAC గా ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వాడుతూనే వరంగల్ (హైదరాబాద్) జోనల్ ల్యాబ్ SES గా కూడా సదరు అధికారినే ఉండటంతో SES కు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని కూడా హైదరాబాద్ లోని తన ఇంటి దగ్గరే పెట్టుకొని తన కుటుంబ సభ్యులు షాపింగ్ కు, కాలేజీలకు, శుభకార్యాలకు తిరగడానికి వాడుతున్నారు అని పలువురు PCB అధికారులే చెప్పడం విశేషం. కనీస ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఉన్నతస్థాయి అధికారులే ఇలా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇక కిందిస్థాయి అధికారులు ఎలా ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. PCB ప్రధాన కార్యాలయంలో జేసీఈఎస్(JCES-FAC) హోదాలో ఉన్నఈ ఉన్నతాధికారి వరంగల్ (హైదరాబాద్) జోనల్ ల్యాబ్ SESకు కేటాయించిన వాహనాన్ని కూడా హైదరాబాద్ లో పెట్టుకొని కుటుంబ సభ్యులు తిరగడానికి విచ్ఛిల విడిగా వాడుతూ అధికార దుర్వినియోగం చేయడం PCB ఉన్నతాధికారులకు కనపడటం లేదా..? ఈ ఉన్నతాధికారికి PCBలో ప్రత్యేక వసతులు ఏమైనా కేటాయించిందా.. వరంగల్ జోనల్ ల్యాబ్ కు సంబంధించి అధికారికంగా వినియోగించే వాహనాన్ని SES కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో కాలేజీలకు, షాపింగ్ లకు, శుభకార్యాలకు ఇలా ఎలా పడితే అలా వాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.. ఆ వాహనానికి ప్రతినెల PCB నుండి ప్రభుత్వ నిధులను చెల్లిస్తున్న అధికారులకు ఆ వాహనం ఎక్కడ తిరుగుతుందో.. ఎవరు వాడుతున్నారో.. ఎందుకు వాడుతున్నారో తెలియడం లేదా.. PCB అధికారిక వాహనం SES కుటుంబ సభ్యులు వాడొచ్చని రూల్ ఏమైనా తెచ్చారా..? జేసీఈఎస్(JCES-(FAC) అధికారికి PCB ఏమైనా రెండు ప్రభుత్వ వాహనాలను వాడుకోవచ్చు అని ప్రత్యేకమైన GO ఏమైనా ఇచ్చిందా..? వరంగల్ జోనల్ ల్యాబ్ SES ప్రస్తుతం JCES-FAC గా కూడా ప్రధాన కార్యాలయంలో అదనపు బాధ్యతల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. PCB ఛైర్మన్, మెంబర్ సెక్రెటరీ కంటే తక్కువ క్యాడర్ అధికారి అలా వ్యవహరిస్తున్నా PCB ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇదంతా మెంబర్ సెక్రటరీకి తెలిసే జరుగుతుందా? లేదంటే తెలియకుండా అందరి కండ్లు కప్పి అధికార దుర్వినియోగం చేస్తున్నాడా..? ప్రభుత్వ వాహనాలను ఎవరు వినియోగించాలో ఆ అధికారికి తెలియదా? దానిపై అవగాహన లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేదంటే నన్ను ప్రశ్నించే వారు PCBలో ఎవరు లేరు అనుకుంటున్నారా..? కాలుష్య నియంత్రణ మండలి జేసీఈఎస్ (JCES-FAC) స్థాయి ఉన్నతాధికారి ప్రభుత్వ వాహనాలను తన కుటుంబ సభ్యులకు ఇష్టారీతిన వాడటాన్ని కిందిస్థాయి అధికారులు ఎవరు ప్రశ్నించరు అనే ధైర్యమా.. లేదంటే ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసిన తనను ఏం చేయరు.. ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోరనే నమ్మకమా..? PCB ఉన్నతాధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈ అధికారిపై చర్యలు తీసుకునే నాథుడే లేడా.. JCES కంటే ఉన్నతాధికారులైన పీసీబీ చైర్మన్ గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, పీసీబీ మెంబర్ సెక్రటరీ కూడా తమకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలనే వాడుతుంటే వరంగల్ జోనల్ ల్యాబ్ SES కి మాత్రం ఎలాంటి భయం లేకుండా దర్జాగా JCES-FAC, SES లకు కేటాయించిన రెండు వాహనాలను వాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మెంబర్ సెక్రెటరీ కంటే కిందిస్థాయి అధికారి దర్జాగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ తమ కుటుంబ సభ్యులను రోజూ ప్రభుత్వ వాహనంలో తిప్పుతున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. JCES గా కూడా ఆయన అదనపు బాధ్యతల్లోనే ఉన్నారు. వరంగల్ జోనల్ ల్యాబ్ ఆఫీస్ SES గా ఉన్న ఈ ఉన్నతాధికారిపై అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి అని పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ అధికారి అవినీతిలీలలు చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి అని పలువురు PCB అధికారులే చెబుతుండటం విశేషం.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న ఈ అవినీతి అధికారిపై సీఎం రేవంత్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, PCB ఛైర్మన్, ACB, విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ కు పొల్యూషన్ బాధితులు, పర్యావరణ వేత్తలు సహా పలువురు ఫిర్యాదులు చేస్తామని చెబుతున్నారు.
ఈ ఉన్నతాధికారి వరంగల్ జోనల్ ల్యాబ్ SESగా కాంప్లియన్స్ వెరిఫికేషన్ పేరుతో చేసిన “కరప్షన్ వెరిఫికేషన్” మరియు ఈయనగారి అధ్వర్యంలో ల్యాబ్ ల కోసం తీసుకున్న GC (Gas Chromatography) లు తీసుకోబోతున్నGC-MS (Gas Chromatography Mass Spectrometry) లలో జరిగిన అవినీతి.. జరగబోతున్న ఆవినీతిపై త్వరలో ప్రత్యేక కథనాలు నిఘానేత్రం న్యూస్ లో.. “మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం”…