- అధికారులను ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ఐఎఎస్
హైదరాబాద్ : భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 25.06.2026 నుండి ప్రారంభం అవుతుందని, ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఓ) శ్రీ సి. సుదర్శన్ రెడ్డి, ఐఎఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ సన్నాహక చర్యలపై శుక్రవారం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఐఎఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను DEOs, ERO అధికారులు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
• బూత్ స్థాయి అధికారులు (BLOs), బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలి.
• క్షేత్రస్థాయిలో కనీసం వారానికి ఒకసారి సమీక్షా సమావేశాలను నిర్వహించి అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి.
• గణన ఫారం (Enumeration Form – EF) నింపడం, పంపిణీ, సేకరణ , డేటా అప్‌లోడ్ ప్రక్రియలపై BLOలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలి.
• తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs), కరపత్రాలు (Pamphlets), స్థానిక అవగాహన కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి.
• పారదర్శకతను నిర్ధారించేందుకు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి.
• ఎస్ ఐఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, గ్రామ పంచాయతీలు, ఇతర భాగస్వామ్య వర్గాలను భాగస్వామ్యం చేయాలి. పైన సూచించిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేస్తే ఓటర్ జాబితా రూపకల్పనకు సంబంధిత అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ జిల్లా కమిషనర్, జీహెచ్‌ఎంసీ & జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లా కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు పాల్గొన్నారు. ఉప ప్రధాన ఎన్నికల అధికారి (FAC), నోడల్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్ (IT), సంబంధిత సిబ్బంది హాజరయ్యారు.