రైల్వే శాఖ మంత్రితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయి..: సీఎం రేవంత్ రెడ్డి

  • రేపు కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఖ‌ట్ట‌ర్‌తో భేటీ

ఢిల్లీ: హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రిగాయ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో సోమ‌వారం రాత్రి సీఎం భేటీ అయ్యారు. అనంత‌రం సీఎం విలేక‌రుల‌తో మాట్లాడారు. రైల్వే మంత్రితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయ‌న్నారు. ఈ అంశంపై కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం భేటీ అవుతామ‌ని సీఎం వెల్ల‌డించారు.