హైదరాబాద్ : సమాచార పౌరసంబంధాలశాఖలో క్రియేటివ్ డైరెక్టర్ గా నియమితులైన రాజు కొండా సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారశాఖలో ఆయన సేవలను వినియోగించుకునేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు అందించనున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.