- ఈ రోజు 7 నుండి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధుల విడుదల
- నేడు 7 నుండి 8 ఎకరాల సాగు భూమి ఉన్న 58,831 మంది రైతుల ఖాతాలలో 259.73 కోట్లు జమ
- ఇప్పటివరకు మొత్తం 68.96 లక్షల మంది రైతులకు రూ.7750.45 కోట్ల రైతుభరోసా సాయం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద నేడు 7 వ విడతలో 7 నుండి 8 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 259.73 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 58,831 మంది రైతులు, 4.32 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నామని, ఇప్పటికే 6 దశలలో 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, ఈ రోజు 7 నుండి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించమన్నారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 68.96 లక్షల మంది రైతులకు, 129.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి రూ.7750.45 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.